Adilabad: సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు సజీవ దహనం..

Gas Cylinder Blast at Pippalkoti Project in Adilabad District
x

Adilabad: సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు సజీవ దహనం..

Highlights

Adilabad: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Adilabad: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చనాకా- కోర్ట ప్రాజెక్ట్‌ కార్మికుల శిబిరంలో సిలిండర్ పేలింది. వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గ్యాస్‌ సిలిండర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.

కార్మికులు వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడి చూస్తుండగానే వ్యాపించాయి. మంటలు అంటుకొని కూలీల్లోని ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. అగ్ని ప్రమాదం సమీపంలోనే ఉన్న నాలుగు టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం అయింది. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనతో కూలీలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories