గంజాయి ఉత్పత్తి కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. అమాయక రైతులను టార్గెట్ చేసిన..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గంజాయి తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్మగ్లర్లు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గంజాయి తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్మగ్లర్లు గంజాయిని విచ్చలవిడిగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా బోథ్, బజరాత్నూర్, గడిహథ్నూర్ మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో నిషేధిత గంజాయిని సాగు చేస్తున్నారు. పత్తి, కందిపంటలో గంజాయిని అంతరపంటగా వేసి సాగుచేస్తున్నారు స్మగ్లర్లు.
లక్షల రూపాయలు వస్తాయని ఆశ కల్పించి అమాయక రైతులతో గంజాయిని సాగుచేయిస్తోంది మాఫియా. బోథ్ నియోజకవర్గంతో పాటు ఇంద్రవెల్లి, ఉట్నూరు, కెరమెరి, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్ టి, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో రైతులను టార్గెట్‌గా చేసుకుని ఎన్నో ఎకరాల్లో గంజాయి సాగుచేయిస్తోంది. దీంతో కొందరు అమాయక రైతులు గంజాయిని పత్తి పంటలో అంతర పంటగా మరికొందరు ఎవరికీ కనిపించకుండా దట్టమైన అడవుల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాగుచేసిన గంజాయి చేతికి అందే దశకు రాగా మరికొన్ని ప్రాంతాల్లో చివరి దశలో ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పత్తిచేనుల మాదిరిగా గంజాయి వనాలున్నాయి. ఉత్పత్తి చేసిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై, నాగ్‌పూర్, పూణె లాంటి ప్రాంతాలకు, అదేవిధంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. రైతుల నుంచి సాగుచేసిన గంజాయిని కిలోకు 5వేలు చొప్పున కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో కిలో 10వేలకు అమ్ముకొని వేలాది కోట్లు వెనకేసుకుంటోంది మాఫియా. ఉత్తర భారతంలోని యువత గంజాయికి బానిసలుగా మారడం మరోవైపు వీఐపీలు, సినిమా హీరోలు, హీరోయిన్లు గంజాయికి అలవాటుపడటం మాఫియాకు వరంగా మారింది.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMTEknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ
27 Jun 2022 7:26 AM GMTశివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు
27 Jun 2022 7:25 AM GMTయాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ
27 Jun 2022 7:15 AM GMT