Top
logo

వరంగల్ నగరాన్ని గంజాయి నిషా కమ్మేస్తోంది.. యువత టార్గెట్‌గా సాగుతోన్న..

వరంగల్ నగరాన్ని గంజాయి నిషా కమ్మేస్తోంది.. యువత టార్గెట్‌గా సాగుతోన్న..
X
Highlights

ఓరుగల్లు యువత బతుకు ఛిద్రమవుతోంది. గంజాయి ఘాటు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. గంజాయి అక్రమ రవాణా మత్తు ...

ఓరుగల్లు యువత బతుకు ఛిద్రమవుతోంది. గంజాయి ఘాటు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. గంజాయి అక్రమ రవాణా మత్తు పదార్థాల వినియోగంతో భవిష్యత్‌ను కోల్పోతున్నారు యువకులు. మత్తులో ఏం చేస్తున్నామో తెలియక ఏకంగా నేరగాళ్లుగా మారుతున్నారు.

వరంగల్ నగరాన్ని గంజాయి నిషా కమ్మేస్తోంది. యువతను టార్గెట్ చేస్తోన్న మాఫియా వారిని మత్తు ఊబిలోకి దించుతున్నారు. ఇలా గంజాయి మత్తులో పడిన యువత నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ విద్యార్థి గంజాయి డబ్బుల కోసం స్వంత మేనత్తను హత్యచేసిన తీరు ఆశ్చర్య పర్చింది. అప్పుల బాధలు, ఆర్ధిక ఇబ్బందులు, లగ్జరీ జీవితం గడపాలన్న కోరిక గంజాయి రవాణాకు కారణమవుతున్నాయి. విశాఖపట్నం నుండి ఈ దందా నడుస్తుందని పోలీసులు గుర్తించారు.

కొద్దిరోజుల క్రితం వరంగల్ లోని నిట్ లో ఎకంగా పదకొండు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇలా వరంగల్ లో చదువుకునేందుకు వస్తోన్న సంపన్నుల పిల్లలు టార్గెట్ గా గంజాయి మాఫియా విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలరోజుల్లో భారీ ఎత్తున గంజాయి పట్టు బడటం కలకలం రేపింది. విచారణలో అక్రమ దందాకు నడుస్తున్న తీరుకు పోలీసులే నివ్వెరపోయారు.

Web Titleganja smugglers target youth in Warangal
Next Story