Vikarabad: తాండూరులో గంజాయి మొక్కల కలకలం

Vikarabad: వికారాబాద్ జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 2:06 PM IST
Vikarabad: తాండూరులో గంజాయి మొక్కల కలకలం
X

Vikarabad: తాండూరులో గంజాయి మొక్కల కలకలం

Vikarabad: వికారాబాద్ జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి. తాండూరులో ఓ వ్యక్తి తన పొలంలో గంజాయి మొక్కలు పండిస్తున్నట్లు సమాచారం అందడంతో డీటీఎఫ్, SHO తాండూర్ టీం మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. కోట్పల్లి మండలం బార్వాద్‌లో పెంటయ్య అనే వ్యక్తి తన ఇంటి దగ్గర గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీలు చేసి నిందితుడి దగ్గర గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story