Top
logo

Gangula Kamalakar: ఈటల రాజీనామా చేసేందుకు భయపడుతున్నారు- గంగుల

Gangula Kamalakar Slams Etala Rajender
X

Gangula Kamalakar: ఈటల రాజీనామా చేసేందుకు భయపడుతున్నారు- గంగుల

Highlights

Gangula Kamalakar: ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి గంగుల కమలాకర్‌.

Gangula Kamalakar: ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి గంగుల కమలాకర్‌. రాజీనామా చేసేందుకు ఈటల భయపడుతున్నారని, ధైర్యం ఉంటే రాజీనామా చేసి.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ జిల్లాను బొందలగడ్డగా మారుస్తున్నామని ఈటల అంటున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 30 క్వారీలు ఈ రోజువరకు ఎందుకు నడుస్తున్నాయో ఈటల సమాధానం చెప్పాలని అన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 350 గ్రానైట్‌ క్వారీల్లో తనకు ఒక్కటి మాత్రమే ఉందన్న గంగుల ట్యాక్స్‌ కట్టలేదని నిరూపిస్తే 5రెట్లు అధికంగా పే చేస్తానని సమాధానమిచ్చారు. తాను ఓడిపోవాలని ఈటల అనుకున్నాడని, ఓడించేందుకు కుట్రలు కూడా చేశారని ఆరోపించారు గంగుల.

Web TitleGangula Kamalakar Slams Etala Rajender
Next Story