మంత్రి గంగుల కమలాకర్‌కి తప్పిన ప్రమాదం.. కుప్పకూలిన వేదిక.. కిందపడ్డ మంత్రి, కార్యకర్తలు..

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కి ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 16 April 2023 2:48 PM IST
Gangula Kamalakar Escapes Danger After Stage Collapses
X

మంత్రి గంగుల కమలాకర్‌కి తప్పిన ప్రమాదం.. కుప్పకూలిన వేదిక.. కిందపడ్డ మంత్రి, కార్యకర్తలు..

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కి ప్రమాదం తప్పింది. కరీంనగర్‌ జిల్లా చెర్లబూట్కూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. వేదికపైకి ఎక్కారు. అయితే ఒక్కసారిగా వేదిక కుప్పకూలడంతో.. మంత్రి సహా కార్యకర్తలు కూడా కిందపడ్డారు. స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు చిన్న గాయమే అయిందన్న మంత్రి... జడ్పీటీసీకి కాలు విరిగినట్లు తెలుస్తుందని చెప్పారు. వేదికపై జనం ఎక్కువ కావడంతోనే కూలినట్టు స్థానికులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story