Gangula Kamalakar: ఈటలకు దమ్ముంటే గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలి

Gangula Kamalakar: బీజేపీలో ఆధిపత్యం కోసం ఈటల ఆరాటపడుతున్నారు

Shekhar G
Published on: 13 Oct 2023 12:19 PM IST
Gangula Kamalakar Comments On Etela Rajender
X

Gangula Kamalakar: ఈటలకు దమ్ముంటే గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలి 

Gangula Kamalakar: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈటలకు దమ్ముంటే గజ్వేల్‌ నుంచే పోటీకి దిగాలని చెప్పారు. హుజూరాబాద్‌ నుంచి కూడా ఈటల పోటీకి దిగుతున్నారంటే భయపడినట్టే కదా..? అని చురకలు అంటించారు. బీజేపీలో ఆధిపత్యం కోసం ఈటల ఆరాట పడుతున్నారని ఆరోపించారు. ఈసారి తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నా అని జోస్యం చెప్పారు గంగుల.

Shekhar G

Shekhar G

Next Story