Hyderabad: కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Gang Selling Hash Oil Was Arrested In Kukatpally
x

Hyderabad: కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Highlights

Hyderabad: హాష్‌ ఆయిల్‌ మత్తు పదార్థాన్ని విక్రయించేందుకు ఇద్దరు వ్యక్తుల యత్నం

Hyderabad: కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హాష్‌ ఆయిల్‌ మత్తు పదార్థాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుండి 4లక్షల 40వేల విలువైన హాష్‌ ఆయిల్‌ నింపిన 220 చిన్న కంటైనర్‌ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నారా పూజారి, మధు హంటల్‌ ఏపీలోని సీలేరు నుండి హాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసి కూకట్‌పల్లిలో విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నామన్నారు బాలానగర్‌ డీసీపీ శ్రీనివాసరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories