నిజామాబాద్‌లో దారుణం.. ఓ యువతిపై గ్యాంగ్ రేప్

నిజామాబాద్‌లో దారుణం.. ఓ యువతిపై గ్యాంగ్ రేప్
x
Highlights

నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అంతే కాకుండా.. తన స్నేహితుల్ని కూడా పిలిచి అఘాయిత్యం చేయించాడు. ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ఆ దారుణాన్ని వీడియో తీసి పైశాచిక ఆనందాన్ని పొందాడు.

నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా.. తన స్నేహితుల్ని కూడా పిలిచి అఘాయిత్యం చేయించాడు. ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ఆ దారుణాన్ని వీడియో తీసి పైశాచిక ఆనందాన్ని పొందాడు.

నిజామాబాద్‌ నగర శివార్లలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఫ్యాక్టరీ నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలోనే పనికి వెళ్లి జీవనం సాగించేది. ఈ క్రమంలోనే ఆటో నడిపే సురేశ్‌ అనే వ్యక్తితో ఆమె పరిచయం ఏర్పడింది. సురేశ్ తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సురేశ్ మాత్రం తనకు పెళ్లయిన విషయాన్ని యువతితో చెప్పకుండా ప్రేమ నటించాడు‌. శుక్రవారం మధ్యాహ్నం సారంగాపూర్‌ హనుమాన్‌ ఆలయానికి వెళ్దామని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లీ.. అక్కడ ఉన్న జిల్లా జైలు వెనకకు తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఆరుగురు స్నేహితులను పిలిచి అత్యాచారం చేయించాడు. అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పోలీసులు గమనించారు. దీంతో వారిని తమదైన శైలిలో విచారించగా యువతిపై అత్యాచారం చేసిన విషయం బయటపడింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు. బాధితురాలి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనసై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories