హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌

Hyderabad: రెండు రోజులపాటు ఓయో లాడ్జీలో బాలికపై అత్యాచారం

Jyothi
Updated on: 15 Sept 2022 2:56 PM IST
Gang Rape of a Minor Girl in Hyderabad Oldcity
X

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. పాతబస్తీ డబీర్‌పురా నుంచి కారులో బాలికను కిడ్నాప్‌ చేసిన యువకులు.. రెండు రోజులపాటు ఓయో లాడ్జీలో బంధించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం లాడ్జీలో బాలికను వదిలిపెట్టి వెళ్లిపోయారు యువకులు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story