Ganesh Chaturthi: ఘనంగా వినాయక చవితి వేడుకలు

Ganesh Chaturthi: వివిధ రూపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్యలు * గణనాథుడికి భక్తి శ్రద్ధలతో విశేష పూజలు

Sandeep Eggoju
Published on: 10 Sept 2021 7:13 AM IST
Ganesh Chaturthi Celebrations Across the Telangana
X

ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Ganesh Chaturthi: దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బొజ్జగణపయ్యల ప్రతిమలు శోభాయమానంగా కొలువుదీరాయి. ప్రత్యేకంగా రూపొందించిన మంటపల్లో గణనాథుడిని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. కొందరు ఇంట్లో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఉదయం నుంచే అన్ని గణేష్‌ ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అటు పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలకు ఉత్సవాలు జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వినాయకుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకున్న భక్తులు.. ఈఏడాది కూడా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story