గణేశ్‌ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం

Ganesh Festival: ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ శాఖ సమావేశం

Jyothi
Published on: 19 Aug 2022 6:44 AM IST
Ganesh Celebrations in Hyderabad From 31st of this Month
X

గణేశ్‌ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం

Ganesh Festival: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు ఈనెల 31న ప్రారంభమై.. సెప్టెంబర్‌ 9వరకు కొనసాగనున్నాయి. గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్‌ఐలు ముందుగానే సమావేశం కావాలన్నారు.

శాంతిభద్రతల్లో ఎక్కడా సమస్యని రానివ్వొద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఇక సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవొద్దని సూచించారు.

Jyothi

Jyothi

Next Story