Hyderabad: గాంధీ ఆస్పత్రిలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Gandhi Hospital Computer Operator Harassment on Womens
x

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: పేషెంట్‌కు సాయంగా వచ్చిన అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి *ఈ నెల 4న మహబూబ్‌నగర్ కు చెందిన నర్సింహులు గాంధీలో చేరిక

Hyderabad: హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. పేషెంట్‍ కు సాయంగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాధితుల్లో ఒకరు ఇంటికి చేరుకున్నారు. కానీ మరో మహిళ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతకీ ఆమె ఏమైనట్లు. నిందితులు ఆమెను ఏం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వేపురిగేరికి చెందిన కర్నె నర్సింహులు కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 4న హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. ఆయనకు సాయంగా భార్య తిరుపతమ్మ ఆమె చెల్లెలు సువర్ణ వెళ్లారు. నర్సింహులును వేరు వార్డుకు మార్చడంతో అది ఎక్కడో తెలియక అక్కాచెల్లెల్లు తికమకపడ్డారు. ఆ సమయంలో ఓపీ సెక్షన్‌లోని కంప్యూటర్‍ ఆపరేటర్‌ ఉమామహేశ్వర్‍ వార్డు చూపిస్తానని మచ్చిక చేసుకున్నాడు. వారిని ఓ స్టోరూంలోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారని బాధితురాలు చెబుతోంది. తనపై నలుగురైదుగురు అత్యాచారం చేసినట్లు బాధితురాలు విలపిస్తోంది.బాధితులు ముందుగా మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ గాంధీ ఆస్పత్రి పరిధిలోని పీఎస్‌కు వెళ్లాలని సూచించడంతో వారు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

గాంధీ ఆస్పత్రిలో ఐదు రోజులుగా ఇంత దారుణం జరిగినా వెలుగు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బంధవులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories