Breaking News: ​​​​​​సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశ్రుతి

Breaking News: సూర్యాపేట జాతీయ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు తరలిరావడంతో 3వ నెంబర్‌ గ్యాలరీ కుప్పకూలింది.

Arun Chilukuri
Published on: 22 March 2021 7:35 PM IST
Gallery Collapsed in Suryapeta Junior National kabaddi
X

Breaking News: ​​​​​​సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశ్రుతి

Breaking News: సూర్యాపేట జాతీయ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు తరలిరావడంతో 3వ నెంబర్‌ గ్యాలరీ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్టు తెలుస్తోంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, 108 సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ పోటీల కోసం నిర్వాహకులు ముందు నుంచి విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక్కో గ్యాలరీలో 5వేల కూర్చునేలా మొత్తం 15వేల సామర్థ్యంతో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story