సీఎం రేవంత్‌ని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్

Krishna Mohan Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ భేటీ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Aug 2024 11:44 AM IST
Gadwal MLA Krishna Mohan Reddy Meets Revanth Reddy
X

సీఎం రేవంత్‌ని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్

Krishna Mohan Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అక్కడి లాబీల్లో కేటీఆర్‌తో కృష్ణమోహన్ సమావేశమయ్యారు.

దీంతో కృష్ణమోహన్ ఘర్ వాపసీ అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణ మోహన్ ఇంటికి మంత్రి జూపల్లి నిన్న వెళ్లారు. పార్టీ మార్పు ఆలోచన లేదని గత పరిచయాలతోనే కేటీఆర్‌తో భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి. ఇక తాజాగా సీఎం రేవంత్‌తో భేటీ అయిన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story