Munugode By-Election: మునుగోడు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్..

Munugode By-Election: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నంత పని చేశాడు.

Arun Chilukuri
Published on: 5 Oct 2022 1:25 PM IST
Gaddar Joined The Prajashanti Party
X

Munugode By-Election: మునుగోడు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్..

Munugode By-Election: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నంత పని చేశాడు. మునుగోడు ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టబోతున్నారు. మునుగోడు ఉపఎన్నిలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన ప్రజాగాయకుడు గద్దర్‌ పేరును ప్రకటించారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. తన కొడుకు కోసమే గద్దర్ కాంగ్రెస్ లో చేరారనే వాదనలున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా కేఏ పాల్ ఆమరణ దీక్ష విరమించారు. గద్దర్ తనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్ 2న పీస్ మీటింగ్ కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ పాల్ ఆమరణ దీక్ష చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story