Gaddar: హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో గద్దర్‌ భౌతికకాయం

Gaddar: గద్దర్‌ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

Jyothi
Published on: 7 Aug 2023 8:35 AM IST
Gaddar Cremation at LB Stadium Hyderabad
X

Gaddar: హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో గద్దర్‌ భౌతికకాయం

Gaddar: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఆయన గొంతుక మూగబోయింది. పాటతో సంపాదించుకున్న కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచారు. ప్రజాకవి, జానపదగాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. నిన్న అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధమైన సమస్యతో చికిత్స పొందుతూ... తుదిశ్వాస విడిచారు.

ప్రజల సందర్శనార్థం.. హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో గద్దర్‌ భౌతికకాయాన్ని ఉంచారు. గద్దర్‌ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. గద్దర్‌ భౌతికకాయానికి కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డితో పాటు పలు పార్టీల రాజకీయనేతలు నివాళులర్పిస్తున్నారు. ఇక.. ఉదయం 11 గంటలకు గద్దర్‌ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్‌ పార్థివదేహం వెళ్లనుంది. ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌లోని గద్దర్‌ ఇంటి వరకు అంతిమయాత్ర సాగనుంది. అంతిమయాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. అల్వాల్‌ మహాబోధి విద్యాలయంలో గద్దర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

Jyothi

Jyothi

Next Story