కొంప ముంచిన కొబ్బరిబొండాల్లో మద్యం...

Gachibowli: హైదరాబాద్‌ గచ్చిబౌలి కారు ప్రమాదం కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు.

Arun Chilukuri
Published on: 19 March 2022 4:56 PM IST
Gachibowli Road Accident Update
X

కొంప ముంచిన కొబ్బరిబొండాల్లో మద్యం...

Gachibowli: హైదరాబాద్‌ గచ్చిబౌలి కారు ప్రమాదం కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. మొత్తం ఏడుగురు కలిసి మద్యం సేవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. హోలి సందర్భంగా మద్యం షాపులు ఉండవని.. ముందే మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు రోహిత్‌ అండ్‌ ఫ్రెండ్స్. తన స్నేహితుడి రూమ్‌లో రోహిత్‌, గాయత్రి సహా మరో ఐదుగురు కలిసి పార్టీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే.. మద్యం అనుమతి చేయరని కొబ్బరి బోండాల్లో ఆల్కహాల్‌ నింపి, వాటిని కారులో పెట్టుకొని..ప్రిజమ్‌ పబ్‌కు రోహిత్‌ బ్యాచ్‌ వెళ్లినట్టు సమాచారం. మొత్తం 8 కొబ్బరి బోండాల్లో మద్యం నింపగా 6 కొబ్బరి బోండాల్లో ఉన్న మద్యాన్ని రోహిత్‌ అండ్ ఫ్రెండ్స్‌ సేవించినట్టు పోలీసులు గుర్తించారు. కారులో మిగిలి ఉన్న 2 కొబ్బరి బోండాలను స్వాధీనం చేసుకొని, పరీక్షల కోసం పంపారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story