Kishan Reddy: మేడారం జాతరకు నిధులు మంజూరు చేసిన కేంద్రం రూ.2.5 కోట్లు ప్రకటించింది

Kishan Reddy: గిరిజన పండుగకు అన్ని విధాలా సహకరిస్తాం

Rama Rao
Updated on: 13 Feb 2022 7:15 PM IST
Kishan Reddy: మేడారం జాతరకు నిధులు మంజూరు చేసిన కేంద్రం రూ.2.5 కోట్లు ప్రకటించింది
X

Kishan Reddy: మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది. రెండున్నర కోట్లు నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తుందని అన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గిరిజన పండుగలలో ఒకటని, ఈ పండుగకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పండుగల నిర్వహణ కోసం నిధులను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story