Nizamabad‌: బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్‌

Beer Bottle: చల్లని బీరు తాగి సేద తిరుదామని అనుకున్న ఒకవ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 Nov 2024 2:12 PM IST
Frog Appear In Beer Bottle At Nizamabad Wine Shop
X

Nizamabad‌: బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్‌

Beer Bottle: చల్లని బీరు తాగి సేద తిరుదామని అనుకున్న ఒకవ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. వైన్స్ కు వెళ్లి బీరు కొన్న వ్యక్తికి బీరు సీసాలో కప్పలాంటి అవశేషం కనిపించే సరికి కంగుతున్నాడు....ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ లో చెందిన ఓ వ్యక్తి బ్లాక్ బస్టర్ బీర్ ను కొనుగోలు చేశాడు. అందులో నల్లగా చెత్త మాదిరిగా కనిపించడంతో బీరు సీసాను తిరిగి వైన్స్ వద్దకు తెచ్చాడు.

ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వ్యక్తికి వైన్స్ నిర్వాహకులు డబ్బులు వాపస్ ఇచ్చేశారు. ఐతే, ఈ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. దీనిపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా, బీరులో ఉన్నది కప్ప అవశేషం కాదని, చెత్తలాంటి పదార్థమని తెలిపారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story