LB Nagar: ఆర్టీసీ కాలనీలో దారుణం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి

Four year Boy Died After Getting Stuck In The Lift At LB Nagar
x

LB Nagar: ఆర్టీసీ కాలనీలో దారుణం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి

Highlights

LB Nagar: వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అక్షయ్‌ కుమార్ తల్లిదండ్రులు

LB Nagar: ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. కొత్తగా నిర్మించిన భవనంలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో అక్షయ్ కుమార్ అందులో ఇరుక్కున్నాడు. బాలుడికి తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే తమ కొడుకుని తమకు చూపించకుండా పోలీసులు, బిల్డింగ్ ఓనర్స్ పోస్టుమార్టంకు తరలించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

Show Full Article
Print Article
Next Story
More Stories