Top
logo

Four Unidentified Persons Arrested : మోహన్ బాబు ఇంటి ముందు హల్చల్ చేసిన దుండగులు అరెస్ట్

Four Unidentified Persons Arrested : మోహన్ బాబు ఇంటి ముందు హల్చల్ చేసిన దుండగులు అరెస్ట్
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Four Unidentified Persons Arrested : డైలాగ్ కింగ్ సినీనటుడు మోహన్‌బాబును ఇటీవలె కొంత మంది వ్యక్తులు కారులో...

Four Unidentified Persons Arrested : డైలాగ్ కింగ్ సినీనటుడు మోహన్‌బాబును ఇటీవలె కొంత మంది వ్యక్తులు కారులో వచ్చి ఆయనను హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆయన ఇంటి వద్ద ఆగంతకులు హల్‌చల్‌ చేసారు. కాగా ఆ వ్యక్తులను ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే శనివారం రాత్రి జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద కొంత మంది ఆగంతకులు కారులో వచ్చి ఆయనను ఉద్దేశించి హెచ్చరించారు. కొద్ది సేపటి తరువాత అక్కడి నుంచి వారు అదే కారులో పరారయ్యారు. అది గమనించిన మోహన్‌బాబు ఇంటి వాచ్ మెన్ వెంటనే ఆయన కుంటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే వారు అక్కడికి చేరుకున్న మోహన్‌బాబు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పహాడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆయన ఇంటి వద్ద స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ కెమెరాలలో చిక్కిన ఫుటేజి ఆధారంగా ఏపీ 31 ఏఎన్‌ 0004 నంబరు గల ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. ఆ కారులోనే దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కార్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు వివరాలను సేకరించి మోహన్ బాబు ఇంటికి వచ్చింది దుండగులు మైలార్‌దేవ్ పల్లిలోని దుర్గానగర్‌కు చెందిన యువకులుగా గుర్తించారు. అనంతరం ఆ నలుగురు ఆగంతకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కాల్ డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వారు కావాలని చేశారా... లేక ఎవరైనా పంపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Web TitleFour Unidentified Persons Arrested : Four Unidentified Persons Arrested who warned mohanbabu at his house
Next Story