Habsiguda: ఓయూ పీఎస్‌ పరిధిలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్‌

Habsiguda: ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు

Shekhar G
Published on: 5 Aug 2023 8:00 PM IST
Four Students Are Missing In Habsiguda
X

Habsiguda: ఓయూ పీఎస్‌ పరిధిలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్‌

Habsiguda: ఓయూ పీఎస్‌ పరిధిలో స్కూల్‌ విద్యార్థుల అదృశ్యం ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. హబ్సిగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు.. మిస్‌ అయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. విద్యార్థుల మిస్సింగ్‌పై ఆవేదన చెందుతున్నారు. స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలు కనిపించకపోవడంపై స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం చెబుతోందని ఆరోపిస్తున్నారు. ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. స్కూల్‌ నుంచి విద్యార్థులు బయటకు వచ్చిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు ఎక్కడకు వెళ్లారనే దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story