Anthrax Disease: వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం
*దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ నిర్ధారణ *ఆంత్రాక్స్‌తో నాలుగు గొర్రెలు, ఒక మేక మృతి
వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం(ఫైల్ ఫోటో)
Anthrax Disease: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ కలకలం రేగింది. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు, ఒక మేక మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన గొర్రెలు సాంబయ్య అనే రైతుకు చెందినవిగా గుర్తించారు. గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలంటూ అధికారులు గ్రామస్తులకు సూచించారు. గొర్రెలకు వ్యాక్సిన్ వేస్తున్నామంటున్నారు అధికారులు.
Next Story




