భక్తుల సౌకర్యార్థం భద్రాచలంలో నాలుగు పోలీస్ అవుట్ పోస్టులు

భక్తుల సౌకర్యార్థం భద్రాచలంలో నాలుగు పోలీస్ అవుట్ పోస్టులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో...

భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు లో భాగంగా 5వ తారీఖున జరుగనున్న తెప్పోత్సవం, ఆరవ తారీకున ఉదయం జరగనున్న ఉత్తరద్వార దర్శనమునకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, యాత్రికుల సౌకర్యార్థం భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నందు పోలీస్ అవుట్ పోస్టు (ఇన్ఫర్మేషన్ సెంటర్స్) ఏర్పాటు చేశామని, స్నానాల ఘాట్ వద్ద, రామాలయం వద్ద, స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నందు కూడా అవుట్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

భక్తులు తమ విలువైన వస్తువులను, ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు తమ పర్సులు, బ్యాగులు, క్లాక్ రూమ్ లో, గదులలో భద్రపరచుకుని ఉత్సవానికి రావాలని సూచించారు. దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున భక్తులు గమనించాలని, పోలీసులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. పిల్లలు పెద్దలు ముసలి వారు ఎవరైనా తప్పిపోయిన పోయినా పట్టణంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు లలో ఎక్కడైనా పంపించాలని సూచించారు. అంతే కాక అత్యవసర పరిస్థితి లో 100 కి కాల్ చేయాలని, అలాగే పట్టణ సిఐ 9440795320, ట్రాఫిక్ ఎస్ఐ 9704773656 నంబర్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories