Srirampur Singareni Mine: పైకప్పు కూలి నలుగురు కార్మికుల మృతి

Srirampur Singareni Mine: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లో ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Nov 2021 5:50 PM IST
Four People Dead After Roof of Mine Collapsed SRP-3 of Srirampur
X

Srirampur Singareni Mine: పైకప్పు కూలి నలుగురు కార్మికుల మృతి

Srirampur Singareni Mine: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లో ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఎస్‌ఆర్‌పీ - 3 గనిలో పై కప్పు కూలినట్లు తెలుస్తోంది. ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. బొగ్గు శిథిలాల కిందపడి మరణించిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌ ఇబ్బందిగా మారింది. మరో రెండు గంటల సమయం పట్టవచ్చని కార్మికులు చెబుతున్నారు.

కాగా ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మిగిలిన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story