నిజామాబాద్‌లో విషాదం.. భార్యపిల్లలతో రియల్టర్ సూర్యప్రకాశ్ ఆత్మహత్య

Four Family Members Committed Suicide in Hotel at Nizamabad
x

నిజామాబాద్‌లో విషాదం.. భార్యపిల్లలతో రియల్టర్ సూర్యప్రకాశ్ ఆత్మహత్య

Highlights

Nizamabad: నిజామాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది.

Nizamabad: నిజామాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. వీరంతా ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. మృతులు సూర్యప్రకాష్, అక్షయ, ప్రత్యుష, అద్వైత్‌గా గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో నలుగురు ఉరివేసుకున్నారు. సూర్యప్రకాష్ తన భార్య, ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్య ప్రకాశ్ హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories