యాదాద్రికి చేరుకున్న నలుగురు సీఎంలు

* యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్న నేతలు

Dhatripriya
Published on: 18 Jan 2023 11:40 AM IST
Four CMs Reached Yadadri
X

యాదాద్రికి చేరుకున్న నలుగురు సీఎంలు

BRS Avirbhava Sabha: సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలతో కలిసి రెండు చాపర్లలో యాదాద్రి చేరుకున్నారు. నలుగురు సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు నేతలు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మంకు నలుగురు సీఎంలు, యూపీ మాజీ సీఎం చేరుకుంటారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెంకటాయపాలెం సభా ప్రాంగణానికి సీఎం కేసీఆర్, మిగతా ముఖ్యమంత్రులు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేరుకుంటారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించిన తర్వాత వీళ్లంతా మాట్లాడతారు. ఇక ఖమ్మంలో బీఆర్ ఎస్ సభకు అన్ని ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. 100 ఎకరాల్లో జరగనున్న ఈ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story