CM KCR: ఆ బాధ్యత రమణకు అప్పగిస్తాం..

L Ramana: ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకున్నారు.

Arun Chilukuri
Updated on: 16 July 2021 4:41 PM IST
Former TTDP Chief L Ramana Joins in TRS Party
X

ఆ బాధ్యత రమణకు అప్పగిస్తాం.. - సీఎం కేసీఆర్‌

L Ramana: ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకున్నారు. ఎల్.రమణను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ రమణ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు రమణ పార్టీలో చేరారని సీఎం అన్నారు. ఎల్.రమణ నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అన్న ముఖ్యమంత్రి రమణకు మంచి భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు.

రానున్న రోజుల్లో ఎల్‌ రమణ రూపంలో ఒక మంచి రాజకీయ నాయకుడిని ప్రజలు చూస్తారని అభిప్రాయపడ్డారు. చేనేత వర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతల బాధ్యత ఎల్‌.రమణకు అప్పగిస్తామన్నారు. రైతు బీమాలా చేనేతలకు కూడా బీమా వర్తింప చేస్తానని త్వరలో అమలు చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టామని, పథకం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story