Vivek Venkataswamy: బీజేపీకి షాక్‌.. మాజీ ఎంపీ వివేక్‌ రాజీనామా..!

Vivek Venkataswamy: తెలంగాణలో బీజేపీ పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 1 Nov 2023 12:20 PM IST
Vivek Venkataswamy: బీజేపీకి షాక్‌.. మాజీ ఎంపీ వివేక్‌ రాజీనామా..!
X

Vivek Venkataswamy: తెలంగాణలో బీజేపీ పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన లేఖను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. ఇన్నాళ్లు బీజేపీలో తనకు అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు వివేక్ వెంకటస్వామి. వివేక్ వెంకటస్వామిని ఇటీవల బీజేపీ ఎన్నికల మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించింది అధిష్టానం.

బీజేపీకి రాజీనామా ప్రకటించిన వివేక్‌.. గంటల వ్యవధిలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్ నోవాటెల్‌లో ఉన్న రాహుల్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. కొడుకు గడ్డం వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story