మాజీ ఎంపీ కవిత చొరవతో నిరుపేద మహిళకు వైద్యం

మాజీ ఎంపీ కవిత చొరవతో నిరుపేద మహిళకు వైద్యం
x
Highlights

టీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన దయాహృదయ్యాన్ని ప్రజలకు చాటింది. అమ్మ ఆరోగ్యం బాలేదు ఆపరేషన్ చేయాలి, ఆదుకోండి అని ట్వీట్ పెట్టగానే...

టీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన దయాహృదయ్యాన్ని ప్రజలకు చాటింది. అమ్మ ఆరోగ్యం బాలేదు ఆపరేషన్ చేయాలి, ఆదుకోండి అని ట్వీట్ పెట్టగానే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు మాజీ ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన పుష్ప గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని‌ నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. పుష్ప ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలంటే, ఆపరేషన్ చేయాలని నిమ్స్ వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్ కు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడంతో పుష్ప కుటుంబానికి ‌ఎటూ పాలుపోలేదు.

అయితే పుష్ప పరిస్థితి గురించి వివరిస్తూ పుష్ప తనయుడు దుర్గా ప్రసాద్ సహాయం చేయాల్సిందిగా ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవితను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ ‌కల్వకుంట్ల కవిత, పుష్ప పరిస్థితి ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పుష్ప ఆపరేషన్ నిమిత్తం సోమవారం సీఎంఆర్ఏఫ్ నుండి రూ.2 లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరైంది. ట్వీట్ పెట్టగానే, ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకున్న మాజీ ఎంపీ కవితకి పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories