Tera Chinnapa Reddy: బీఆర్‌ఎస్‌కు తేరా చిన్నపరెడ్డి రాజీనామా

Tera Chinnapa Reddy: BRSకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నప రెడ్డి

Jyothi
Published on: 24 March 2024 10:06 AM IST
Former MLC Tera Chinnapa Reddy Resigned From BRS Party
X

Tera Chinnapa Reddy: బీఆర్‌ఎస్‌కు తేరా చిన్నపరెడ్డి రాజీనామా

Tera Chinnapa Reddy: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మారో భారీ షాక్ తగిలింది. ఆపార్టీ నుంచి రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆపార్టీ అధినేత కేసీఆర్‌‌కు పంపించారు. కాగా.. నల్గొండ నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించిన చిన్నపరెడ్డి... తనకు సీటు కేటాయించకపోవడంతో.. పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ సీటును క్యామ మల్లేష్ కు కేటాయించింది అధిష్టానం.

అప్పటివరకూ తనకే ఎంపీ సీటు ఇస్తారని భావించిన చిన్నపరెడ్డి... చివరి నిమిషంలో భంగపాటును ఎదుర్కొన్నారు. కలత చెందిన చిన్నపరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తదుపరి చిన్నపరెడ్డి భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ప్రశ‌్నగా మారింది.

Jyothi

Jyothi

Next Story