Case Reopen: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి కేసు రీఓపెన్

Case Reopen: మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి కేసులో కీలక మలుపు

Shashank Gullapelli
Updated on: 21 March 2024 12:02 PM IST
Former MLA Shakeel Son Case Reopened
X

 Case Reopen: మాజీ ఎమ్మె్ల్యే షకీల్‌ కుమారుడి కేసు రీఓపెన్

Case Reopen: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌పై కేసు నమోదైంది. గతంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో కారు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన మూడు రోజుల తరువాత ఈ కేసులో షకీల్ కుమారుడి డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. తానే కారు నడిపినట్టు చెప్పడంతో అఫ్సాన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు అప్పటి పోలీసులు.

ప్రమాద సమయంలో కారు నడిపింది షకీల్‌ కుమారుడు రహేల్‌గా తాజాగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును వెస్ట్ జోన్ డీజీపీ రీ ఓపెన్ చేశారు. మరోవైపు పంజాగుట్ట ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కూడా రహేల్ పరారీలో ఉన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌పై రెండు నెలల క్రితం పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story