Harish Rao: జిల్లా ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీష్‌రావు

Harish Rao: సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Shashank Gullapelli
Published on: 27 April 2024 12:33 PM IST
Former Minister Harish Rao Unveiled The Flag At The District Office
X

Harish Rao: జిల్లా ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీష్‌రావు

Harish Rao: సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ మాసం హైదరాబాద్ జల దృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికే ఆదర్శం అయిందని హరీష్ రావు అన్నారు. నాడు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి పదవులకు రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభించామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ లేదని.. తెలంగాణ లేకుంటే.. సిద్ధిపేట జిల్లానే ఉండేది కాదన్నారు. గత పదేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే.., రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని విమర్శించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story