Bonthu Rammohan: సీఎం రేవంత్‌రెడ్డితో జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భేటీ

Bonthu Rammohan: తాను పోటీ చేసే స్థానంపై కాంగ్రెస్‌ క్లారిటీ ఇస్తే.. కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో బొంతు రామ్మోహన్‌

Shekhar G
Updated on: 11 Feb 2024 6:15 PM IST
Former Mayor of GHMC Bonthu Rammohan met CM Revanth Reddy
X

Bonthu Rammohan: సీఎం రేవంత్‌రెడ్డితో జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భేటీ

Bonthu Rammohan: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..బీఆర్ఎస్‌లో కొంత మంది నేతల వైఖరి ఆ పార్టీని కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అవ్వగా..తాజాగా అదే బాటలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న బొంతు రామ్మోహన్...కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ పెద్దలలో చర్చలు జరుపుతున్నారని పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ రోజు లేదా రేపు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. తాను పోటీ చేసే స్థానంపై కాంగ్రెస్ క్లారిటీ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు బొంతు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story