రిటైర్డ్‌‌ న్యాయమూర్తికే పింఛన్‌‌‌‌ ఇవ్వట్లేదు : జస్టిస్‌‌‌‌ జి.శ్రీదేవి

పెన్షన్‌ కోసం మాజీ హైకోర్ట్‌ జడ్జి న్యాయ పోరాటం చేపట్టింది. రిటైర్డ్‌ అయ్యి 3ఏళ్లు అవుతున్నా తనకు పూర్తి పెన్షన్‌ అందండం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 11:37 AM IST
రిటైర్డ్‌‌ న్యాయమూర్తికే పింఛన్‌‌‌‌ ఇవ్వట్లేదు : జస్టిస్‌‌‌‌ జి.శ్రీదేవి
X

పెన్షన్‌ కోసం మాజీ హైకోర్ట్‌ జడ్జి న్యాయ పోరాటం చేపట్టింది. రిటైర్డ్‌ అయ్యి 3ఏళ్లు అవుతున్నా తనకు పూర్తి పెన్షన్‌ అందండం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 2022 అక్టోబర్‌లో రిటైర్డ్‌ అయిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి.. తనకు పూర్తి పెన్షన్‌ మంజూరు చేయడంలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి పెన్షన్‌ మంజూరు ప్రక్రియను ప్రారంభించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోపు ఆ వివరాలను కోర్టుకు తెలపాలని అధికారులకు సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story