'హాత్ వే' రాజశేఖర్ కన్నుమూత

Arun Chilukuri
Published on: 29 Aug 2020 2:41 PM IST
హాత్ వే రాజశేఖర్ కన్నుమూత
X

Hathway Rajasekhar: హాత్‌ వే డిజిటల్‌ కేబుల్‌ మాజీ డైరెక్టర్ రాజశేఖర్ గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈయన తుదిశ్వాస విడిచారు. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసు రంగంలో రాజశేఖర్‌ సుదీర్ఘ కాలంగా సేవలందించారు. 1968 ఏప్రిల్ 4 న విజయనగరం జిల్లా సీతానగరం లో జన్మించిన ఆయన తొలిసారి విశాఖపట్నంలో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే హైదరాబాద్ వేదికగా మొదలైన హాత్ వేలో రీజినల్ హెడ్‌గా భాద్యతలు స్వీకరించారు. హాత్ వేను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్‌గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో హాత్ వేకు తిరుగులేకుండా చేయడంలో ఆయనదే కీలకపాత్ర.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story