Praneet Rao: ఇవాళ నాంపల్లి కోర్టుకు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు

Praneet Rao: ప్రవీత్‌రావును కోర్టులో హజరుపర్చనున్న పోలీసులు

Jyothi
Published on: 13 March 2024 7:29 AM IST
Former DSP Praneet Rao to Nampally Court today
X

Praneet Rao: ఇవాళ నాంపల్లి కోర్టుకు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు

Praneet Rao: ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో ప్రణీత్‌రావును హాజరు పరుచనున్నారు. ఈ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్‌‌‌‌రావు పక్కా ప్లాన్‌‌‌‌తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌‌‌‌బీలో రిపోర్ట్‌‌‌‌ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్‌‌‌‌ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్‌‌‌‌బీకి వెళ్లలేదని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ప్రణీత్‌‌‌‌రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్​రావును హైదరాబాద్‌కు తరలించారు.

Jyothi

Jyothi

Next Story