Siva Balakrishna: ఆరో రోజు ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్

Siva Balakrishna: శివబాలకృష్ణను విచారించనున్న ఏసీబీ అధికారులు

Jyothi
Published on: 5 Feb 2024 11:05 AM IST
Former Director of HMDA in ACB Custody on Sixth Day
X

Siva Balakrishna: ఆరో రోజు ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్

Siva Balakrishna: అక్రమ ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఆరో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. ఐదు రోజుల విచారణలో 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. అవినీతి కేసులో HMDA, రెరా ఉద్యోగులను కూడా ఏసీబీ విచారించింది. HMDA విభాగంలో కీలక స్థానాల్లో శివబాలకృష్ణతో కలిసి పని చేసిన ఉద్యోగులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

మరో వైపు రెరాలోని ఉద్యోగులను సైతం శివబాలకృష్ణ ఎదుట కూర్చోబెట్టి విచారించారు. బాలకృష్ణ అనుమతులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై విచారణ సందర్భంగా ఏసీబీ ఆరా తీసింది. అటు HMDAలో ఐరేస్ అపార్ట్స్‌మెంట్స్‌కి మ్యానువల్ పర్మిషన్స్ ఇచ్చిన వ్యవహారంపై కూడా ఏసీబీ క్వశ్చన్ చేసింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు కూడా పర్మిషన్ ఇచ్చాడు శివబాలకృష్ణ.

Jyothi

Jyothi

Next Story