Jagga Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం

Jagga Reddy: రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలు నిందిస్తున్నారు

Shashank Gullapelli
Published on: 23 April 2024 5:18 PM IST
Former Congress MLA Jagga Reddy Fire On BJP And BRS
X

Jagga Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం

Jagga Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడని, సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ పాలనలోనే ఉమ్మడి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు దేవుళ్లు, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story