KCR: రైతులకు భరోసానిచ్చేందుకు పొలంబాట పట్టిన మాజీ సీఎం కేసీఆర్

KCR: జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత

Shashank Gullapelli
Updated on: 31 March 2024 9:09 PM IST
Former CM KCR Went To Polambata To Provide Assurance To The Farmers
X

KCR: రైతులకు భరోసానిచ్చేందుకు పొలంబాట పట్టిన మాజీ సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవిస్తోందంటూ రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ఒక్కరోజే జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించి... ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు. పంటల పరిశీలన అనంతరం సూర్యాపేటలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ప్రతి పంటకు 500 బోనస్‌ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బోనస్‌ ఇచ్చే దాకా వెంటాడుతామని అన్నారు. ఏప్రిల్ 2న అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఏప్రిల్‌ 6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story