పోడు భూములపై వివాదం.. గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ మృతి

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 22 Nov 2022 5:51 PM IST
Forest Range Officer Srinivasa Rao Dies in Tribals Attack
X

పోడు భూములపై వివాదం.. గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ మృతి

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో దారుణం జరిగింది. పోడు భూముల విషయంలో ఫారెస్టు అధికారులకు గుత్తి కోయలకు మధ్య వివాదం చెలరేగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌పై గుత్తి కోయలు విరుచుకుపడ్డారు. కత్తి, గొడ్డలితో దాడి చేశారు. శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అధికారి మృతిప‌ట్ల అట‌వీశాఖ సిబ్బంది సంతాపం ప్రక‌టించారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story