తెలంగాణలో రేపటి నుంచి ఫారెస్ట్‌ సిబ్బంది విధుల బహిష్కరణ

Forest Dept Officials: తెలంగాణలో రేపటి నుంచి విధులు బహిష్కరిస్తామని ఫారెస్ట్‌ సిబ్బంది అల్టిమేటం ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 23 Nov 2022 6:37 PM IST
Forest Dept Officials to Boycott Duties From Tomorrow
X

తెలంగాణలో రేపటి నుంచి ఫారెస్ట్‌ సిబ్బంది విధుల బహిష్కరణ

Forest Dept Officials: తెలంగాణలో రేపటి నుంచి విధులు బహిష్కరిస్తామని ఫారెస్ట్‌ సిబ్బంది అల్టిమేటం ఇచ్చారు. నిన్న గుత్తికోయల దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలు శత్రువులుగా భావిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని ఫారెస్ట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తరహాలో తమకు కూడా ప్రభుత్వం తుపాకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని ఫారెస్ట్ సిబ్బంది స్పష్టం చేశారు. అలాగే సిబ్బందిని కూడా పెంచాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story