Telangana Formation Day: 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలు..

Telangana Formation Day: జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ప్రారంభం

Dhatripriya
Published on: 14 May 2023 9:36 AM IST
For 21 Days Telangana Formation Decade Celebrations
X

Telangana Formation Day: 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలు..

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవరతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష జరిపారు. 21 రోజుల పాటు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపాలని ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి హృదయం ఉప్పొంగేలా , తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాల్లో ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story