గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం.. పిల్లలకు బల్లి పడిన ఆహారం వడ్డించిన హాస్టల్ సిబ్బంది..

Food Poison in Vardhanapeta Government Girls Ashram School
x

గురుకుల ఆశ్రమ పాఠశాలలో దారుణం.. పిల్లలకు బల్లి పడిన ఆహారం వడ్డించిన హాస్టల్ సిబ్బంది.. 

Highlights

Vardhanapeta: వరంగల్ జిల్లాలో వర్దన్నపేట గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది.

Vardhanapeta: వరంగల్ జిల్లాలో వర్దన్నపేట గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆశ్రమంలో సాయంత్రం విద్యార్థులు తిన్న భోజనంలో బల్లిపడింది. ఆ బోజనం తిన్న విద్యార్థులలో సుమారు 40 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు కావడంతో విద్యార్థినులను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హాస్టళ్లో మొత్తం 180 మంది విద్యార్థునులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసకున్న ఎమ్మెల్యే అరురి రమేష్ ఎంజీఎం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories