Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Adilabad: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Sandeep Eggoju
Published on: 7 Sept 2021 11:32 AM IST
Flood Coming Into Homes in Adilabad District Due to Heavy Rains
X
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

‌Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా ఏకాదాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమాయ్యాయి. పలుచోట్ల ఇళ్లల్లోకి వరదనీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాచోట్ల పంటలు నీటమునిగాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story