Hyderabad: మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్ లు.. భయాందోళనలో విద్యార్థులు

Flood at Maisammaguda Hostel Hyderabad
x

Hyderabad: మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్ లు.. భయాందోళనలో విద్యార్థులు

Highlights

Hyderabad: దాదాపు 15 అపార్ట్ మెంట్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు చేరుకున్న వరద నీరు

Hyderabad: నాన్ స్టాప్ గా కురుస్తోన్న కుండపోత వానలకు మరోసారి హైదరాబాద్ అతలాకుతులం అవుతోంది. వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. హైదరాబాద్ గుండ్లపోచంపల్లిలోని మైసమ్మగూడలో ఓ కాలనీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దాదాపు 15 అపార్ట్ మెంట్లు, హాస్టల్ భవనాలు నీట మునిగాయి. అపార్ట్ మెంట్లలోని ఫస్ట్ ఫ్లోర్ వరకు.. వరద నీరు వచ్చి చేరింది. కాలనీ చెరువులోకి వచ్చిందా లేక చెరువే కాలనీలోకి వచ్చిందా అన్నంతగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. దీంతో అపార్ట్ మెంట్ వాసులు, విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. హాస్టల్ లో ఉన్న విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చెరువులు, నాలాలు కబ్జాకు గురి కావడంతో మైసమ్మగూడలోని ఓ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో రియల్ భూమ్ తర్వాత ఖాళీ ప్లేస్ కనబడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. చెరువులను సైతం కబ్జా చేసి వెంచర్లు వేసి అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో వరద నీరు సాఫిగా పోయే దారి లేక కాలనీలకు కాలనీలే నీట మునుగుతున్నాయి. ఇప్పుడు మైసమ్మగూడలో అలాంటి పరిస్థితే కనబడుతోది. మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇప్పట్లో వాన తగ్గే పరిస్థితి లేదు. దీంతో తమను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని మైసమ్మగూడలోని ముంపు బాధితులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories