Jagtial: సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఫ్లెక్సీవార్

Jagtial: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకపై ఢిల్లీలో సంప్రదింపులు కొలిక్కి వచ్చినా జగిత్యాల గల్లీల్లో మాత్రం అనుచరుల మధ్య ఘర్షణ ముదురుతుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Jun 2024 5:27 PM IST
Flexi War in Jagtial Jeevan Reddy vs Sanjay Kumar
X

Jagtial: సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఫ్లెక్సీవార్

Jagtial: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకపై ఢిల్లీలో సంప్రదింపులు కొలిక్కి వచ్చినా జగిత్యాల గల్లీల్లో మాత్రం అనుచరుల మధ్య ఘర్షణ ముదురుతుంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ కుమార్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచురులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సంజయ్ కుమార్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలను ప్రింట్ చేయలేదు.

దీంతో జీవన్ రెడ్డి అనుచరులు సైతం కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అని ఆయన మద్దతుదారులు ఫ్లేక్సీలు ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య వైరం ముదిరినైట్లు అయింది. సంజయ్ కుమార్ చేరికను గల్లీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story