Nizamabad: నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్టు అంటూ ఫ్లెక్సీలు

Nizamabad: జిల్లా వ్యాప్తంగా రైతుల పేరిట వెలిసిన ఫ్లెక్సీలు

Dhatripriya
Updated on: 31 March 2023 11:33 AM IST
Flex War In Nizamabad
X

Nizamabad: నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్టు అంటూ ఫ్లెక్సీలు

Nizamabad: నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్ కలకలం సృష్టించింది. పసుపు బోర్డుకు పంగనామం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్టు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి.

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్ కలకలం సృష్టించింది. పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై నిజామాబాద్ రైతులు కన్నెర్రజేశారు. స్థానిక ఎంపీ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 'పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు' అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని ఎన్నికల సమయంలో స్థానిక ఎంపీ తెలిపారని, మరి నాలుగేళ్లు గడుస్తున్నా పసుపు బోర్డు ఎందుకు సాధించలేకపోయాడని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story