కామారెడ్డి జిల్లాలో పండగ పూట విషాదం

Five Years Boy Nishanth dead body found in drainage kamareddy
x
Highlights

కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దేవుని పల్లిలోని సాయి సద్గురు కాలనిలో పండగ పూట విషాదం చొటు చేసుకుంది. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన...

కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దేవుని పల్లిలోని సాయి సద్గురు కాలనిలో పండగ పూట విషాదం చొటు చేసుకుంది. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన బాలుడు నిశాంత్ గా గుర్తించారు. బాలుడు మృతి తో సాయి సద్గురు కాలనిలో విషాదఛాయలు అలముకున్నాయి. నిశాంత్‌ గురువారం మధ్యాహ్నం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున వారి ఇంటి ఎదురుగా ఉన్న మురుగు కాల్వలో నిశాంత్‌ మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories